తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవి డైలాగ్​తో... ఎన్టీఆర్​కు ఛాలెంజ్​ విసిరిన సుమ - ఎన్టీఆర్​కు ఛాలెంజ్​ విసిరిన యాంకర్​ సుమ

ప్రముఖ హీరో ఎన్టీఆర్​కు ఛాలెంజ్​ విసిరింది యాంకర్​ సుమ. 'గ్రీన్​ ఇండియా' కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని తారక్​కు సూచించింది.

చిరంజీవి డైలాగ్​తో... ఎన్టీఆర్​కు ఛాలెంజ్​ విసిరిన సుమ!

By

Published : Nov 13, 2019, 10:54 PM IST

మెగాస్టార్​ చిరంజీవి నటించిన స్టాలిన్​​ చిత్రంలోని... "ముగ్గురుకి సాయం చేయి... ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పు" డైలాగ్​ అప్పట్లో జనాల్లోకి విపరీతంగా దూసుకెళ్లింది. ఇదే సారాంశంతో ప్రస్తుతం గ్రీన్​ ఛాలెంజ్​ నడుస్తోంది. ఇందులో భాగంగా యంగ్​టైగర్​ ఎన్టీఆర్‌కు యాంకర్‌ సుమ కనకాల గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరింది.

భావితరాలు సంతోషంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటాలన్న 'గ్రీన్ ఛాలెంజ్​'లో భాగంగా.. మొక్కలు నాటాలని ఎన్టీఆర్‌కు విజ్ఞప్తి చేసింది సుమ. తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ హరిత ఉద్యమంలో సహజ నటి జయసుధ చేసిన సవాల్‌ను సుమ స్వీకరించింది. బేగంపేటలోని మయూరి స్టూడియో ఆవరణలో అశోక, వేప, కదంబం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌, తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

"మనిషికి కష్టం ఎదురైనప్పుడు ప్రాణ వాయువును అందించే ప్రకృతి మధ్య గడిపితే నూరేళ్లపాటు ఆనందంగా ఉంటాం" అని ఈ సందర్భంగా సుమ తెలిపింది. ఎన్టీఆర్‌తో పాటు నటి మంచు లక్ష్మి, బిగ్‌బాస్ సీజన్‌-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌, బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్‌కు...ఈ 'గ్రీన్ ఛాలెంజ్' విసిరింది సుమ కనకాల.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details