తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యాంకర్​ సుమ.. సినిమాల్లోకి హీరోయిన్​గా ఎంట్రీ!? - యాంకర్ సమ

ఇప్పటివరకు టీవీ ప్రేక్షకుల్ని అలరించిన యాంకర్ సుమ.. ఇకపై సినిమాలతోనూ ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో దీని గురించి స్పష్టత ఇవ్వనున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు.

anchor suma
యాంకర్ సుమ

By

Published : Nov 2, 2021, 7:22 PM IST

Updated : Nov 2, 2021, 8:29 PM IST

ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత సుమ కనకాల వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. సినీ పరిశ్రమ నుంచి చాలామంది వ్యక్తులు తాను బిగ్ స్క్రీన్​కు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే నటిగానా లేక దర్శకురాలా లేక నిర్మాతగా అనేది త్వరలోనే ప్రకటిస్తామని సుమ బృందం చెప్పింది.

సుమ స్పెషల్ వీడియో

1996లో 'కళ్యాణ ప్రాప్తిరస్తు' చిత్రంతో పెద్దతెరపై కనిపించిన సుమ.. పవిత్ర ప్రేమ, వర్షం, ఢీ, బాద్​షా చిత్రాల్లో సోదరి పాత్రల్లో నటించారు. 2019లో విడుదలైన సమంత ఓ బేబీ చిత్రంలో వ్యాఖ్యాతగా కనిపించిన సుమ కనకాల.. బుల్లితెరపై తనదైన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడుస్తున్నారు

అంతేకాకుండా ఎన్నో చిత్రాల ముందస్తు విడుదల వేడుకల్లో సందడి చేసి ఆ సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేయడం సుమకు సినిమాతో పెట్టిన విద్య. ఈ క్రమంలో సుమ నుంచి ఎలాంటి ప్రకటన రాబోతుందోనని ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 2, 2021, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details