వారంతా ఒకప్పటి డ్యాన్సర్లు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు ఇలా అలనాటి తారలతో కలిసి స్టెప్‌లు వేసినవాళ్లు. అందరికీ 60ఏళ్లకు ఏమాత్రం తక్కువ ఉండవు. ఈ వయసులోనూ తమదైన స్టెప్‌లతో అదరగొట్టి, ప్రేక్షకులను అలరించారు.
సుధీర్‌తో కలిసి అదరగొట్టిన అలనాటి డ్యాన్సర్లు - సుధీర్ అలనాటి డ్యాన్సర్లు
ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు ఇలా వారితో కలిసి డ్యాన్స్ వేసిన అలనాటి తారలతో చిందులేశాడు వ్యాఖ్యాత సుధీర్. వారితో 'ఆచార్య' చిత్రంలోని 'లాహే లాహే' పాటకు కాలు కదిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సుధీర్
తాజాగా ఈటీవీలో ప్రసారమయైన శ్రీదేవి డ్రామా కంపెనీలో అలనాటి డ్యాన్సర్లు వ్యాఖ్యత, నటుడు సుధీర్‌తో కలిసి అగ్ర కథానాయకుడు చిరంజీవి పాటకు స్టెప్‌లు వేశారు. చిరు నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలోని 'లాహే.. లాహే' పాటతో బుల్లితెరను షేక్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటను చూసిన వారందరూ కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆద్యంతం అలరించేలా సాగిన ఈ పాటను మీరూ చూసేయండి.