తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడే పెళ్లి చేసుకుంటా.. శ్రీముఖి క్లారిటీ - శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీ

తనదైన యాంకరింగ్​తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది శ్రీముఖి. తన పెళ్లి గురించి పలుమార్లు ప్రస్తావించినప్పటికీ దాటవేస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది.

శ్రీముఖి
శ్రీముఖి

By

Published : Aug 16, 2021, 9:38 PM IST

మాటల తూటాలతో, తనదైన స్టైల్‌, మ్యానరిజమ్స్‌తో బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి, యాంకర్ శ్రీముఖి. అభిమానులతో ముద్దుగా 'రాములమ్మ' అని పిలిపించుకునే ఆమె.. బుల్లితెరపైనే కాక వెండితెరపైనా మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా ఈ నటి తన పెళ్లి విషయమై స్పందించింది.

అప్పుడే పెళ్లి.!

శ్రీముఖి నటించిన 'క్రేజీ అంకుల్స్' సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె బిజీగా ఉంది. ఈ సందర్భంగా వివాహం ఎప్పుడు? అని శ్రీముఖిని ప్రశ్నించగా.. పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఉత్తమ గుణాలున్న వ్యక్తి తారసపడాలంటే సమయం పడుతుందని.. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పుకొచ్చింది. తనకు 31 నిండేసరికి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 28 ఏళ్లు.

'క్రేజీ అంకుల్స్' సినిమాకు ఈ. సత్తిబాబు దర్శకత్వం వహించగా.. సినీ నేపథ్య గాయకుడు మనో, ప్రముఖ నటుడు రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details