తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్రేజీ అంకుల్స్​'తో నవ్వులు పండిస్తున్న శ్రీముఖి! - bellamkonda suresh latest news

నటి, యాంకర్​ శ్రీముఖి కొత్త సినిమా 'క్రేజీ అంకుల్స్​' ట్రైలర్ విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

anchor sreemukhi new movie crazy uncles trailer has released
'క్రేజీ అంకుల్స్​'తో నవ్వులు పండిస్తున్న శ్రీముఖి

By

Published : Dec 26, 2020, 8:17 PM IST

ప్రముఖ వ్యాఖ్యాత శ్రీముఖి, నేపథ్య గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'క్రేజీ అంకుల్స్'. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్​ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో లాంఛనంగా విడుదల చేశారు.

'క్రేజీ అంకుల్స్' ట్రైలర్​

ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఎంఎల్ కుమార్ చౌదరి, దర్శకుడు శ్రీవాసు ముఖ్య అతిథులుగా హాజరై 'క్రేజీ అంకుల్స్' ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఆద్యంతం నవ్వులు పండించే ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఇదీ చూడండి:తెలుగు ట్రైలర్​తో 'షకీలా'.. 'రెడ్' రిలీజ్ ఫిక్స్

ABOUT THE AUTHOR

...view details