తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జూ సిబ్బంది తీరుపై యాంకర్ రష్మి ఆగ్రహం - రష్మి ఎక్స్​ట్రా జబర్దస్త్

Rashmi news: దిల్లీలోని జంతు ప్రదర్శనశాలలో ఇటీవల ఓ జరిగిన విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది యాంకర్ రష్మి. ఇంతకీ ఏం జరిగింది? ఈమె ఏం చెప్పింది?

anchor rashmi
యాంకర్ రష్మి

By

Published : Jan 29, 2022, 1:34 PM IST

మూగజీవాలపై ఎంతో ప్రేమను కనబరుస్తుంటుంది నటి, వ్యాఖ్యాత రష్మి. మూగజీవాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ తరచూ ఆమె పోస్టులు పెడుతుంటుంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఓ జూలో జరిగిన ఘటన పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిల్లీలోని ప్రముఖ జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ భారీ నీటి ఏనుగు ఉంది. దాన్ని చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇటీవల ఆ నీటి ఏనుగు తన కేజ్‌ నుంచి బయటకు తల పెట్టి చూస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ దాన్ని లోపలికి పంపించేందుకు తలపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా.. అది చూసిన రష్మి ఆగ్రహానికి లోనైంది. జంతువుల పట్ల జూ సిబ్బంది వ్యవహరించిన తీరు బాధాకరమని పేర్కొంది.

"లాక్‌డౌన్‌ సమయంలో మూడు నెలలపాటు ఇంట్లో ఉండటానికి మనం ఎంతో ఇబ్బందిపడ్డాం. అలాంటిది జీవితాంతం వాటిని బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఒక్కసారి ఆలోచించండి" అంటూ రష్మి పోస్ట్‌ పెట్టింది. బ్యాన్‌ జూ అనే ట్యాగ్‌ జత చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details