కరోనా ప్రభావంతో భారత్లో ప్రస్తుతం లాక్డౌన్ విధించారు. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పటికే టీవీ, సినిమా షూటింగ్లు వాయిదా పడ్డాయి. దీంతో ఇండస్ట్రీలో పనిచేసే రోజువారి వేతన కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనుల్లేక వారు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారిని ఆదుకునేందుకు పలువురు నటీనటులు ఇప్పటికే ముందుకొస్తుండగా, యాంకర్ ప్రదీప్ తనకు తోచిన సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
60 మంది కార్మికుల కుటుంబాలకు యాంకర్ ప్రదీప్ సాయం - tollywod news
కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ఓ 60 మంది టీవీ కార్మికుల కుటుంబాలకు, నెలకు సరిపడా ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పాడు బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్. ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
యాంకర్ ప్రదీప్
తనకు తెలిసిన 60మంది టీవీ కార్మికుల కుటుంబాలకు, నెలరోజులకు అవసరమయ్యే ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఈ వీడియోలో చెప్పాడు. అలానే మీకు తెలిసిన దినసరి కార్మికులకు సాయం చేయండని నెటిజన్లను కోరాడు.
పలు సినిమాల్లో సహ నటుడిగా కనిపించిన ప్రదీప్.. పూర్తిస్థాయి హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా ఈనెల 25న విడుదలవాల్సింది. కరోనా కారణంగా అది కాస్త వాయిదా పడింది.