తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నన్ను మానసిక మానభంగం చేస్తున్నారు: ప్రదీప్ - anchor pradeep latest news

అత్యాచారం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని యాంకర్ ప్రదీప్ అన్నారు. ఇందులో నిజనిజాలు తెలియకుండా ఇష్టమొచ్చినట్లు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.

anchor pradeep responds on false allegations
యాంకర్ ప్రదీప్

By

Published : Aug 27, 2020, 7:23 PM IST

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తనను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యాంకర్ ప్రదీప్. పోస్టులు పెట్టడం, అందులో దారుణమైన భాష ఉపయోగించి మానసిక మానభంగం చేస్తున్నారని చెప్పాడు. మిర్యాలగూడకు చెందిన ఓ యువతి.. తనను కొందరు అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టింది. ఈ విషయమై స్పందిస్తూ ప్రదీప్ వీడియోను విడుదల చేశారు.

"సోషల్ మీడియాలో, పలు యూట్యూబ్ ఛానెల్స్​లో నాపై వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయి. నిజనిజాలు తెలియకుండా నాపై రకరకాల ఆర్టికల్స్ రాయడం దారుణం. యాంకర్ ప్రదీప్ అని పేరు కనిపిస్తే ఏం ఆలోచించకుండా రాసేయడమేనా? అవతల వ్యక్తుల ఏ ఉద్దేశంతో చెప్పారో, ఎవరు చెప్పించారో ఆలోచించనక్కర్లేదా? నాపై పోస్టులు పెడుతూ, దారుణమైన బాష ఉపయోగిస్తున్నారు" -యాంకర్ ప్రదీప్

కేసులో నిజనిజాలు తెలియకుండా, ఓ వ్యక్తికి న్యాయం చేసేందుకు మరో వ్యక్తి జీవితాన్ని అన్యాయం చేస్తారా? అని ప్రదీప్ ప్రశ్నించారు. కొందరు చేస్తున్న పని వల్ల తను, తన కుటుంబానికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనకున్న వారందరినీ బయటకు లాగుతానని చెప్పారు. తన గురించి ఇష్టమొచ్చినట్లు రాసేవారికి, కామెంట్లు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details