తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ హీరోయిన్​ని కళ్లు ఆర్పకుండా చూసేవాడ్ని' - ప్రదీప్ మాచిరాజు వార్తలు

ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్​ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ సినిమా శుక్రవారం (జనవరి 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రదీప్​ ప్రత్యేకంగా ముచ్చటించారు.

Anchor Pradeep Machiraju Special Interview with ETV Bharat
'ఆ హీరోయిన్​ని కళ్లు ఆర్పకుండా చేసేవాడ్ని'

By

Published : Jan 28, 2021, 4:36 PM IST

Updated : Jan 28, 2021, 5:11 PM IST

హీరోయిన్ సోనాలీ బింద్రే అంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్​ అన్నారు. ఆమె సినిమాల్లోని పాటలు టీవీలో వస్తే కళ్లు ఆర్పకుండా చూసేవాడ్నని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆయన హీరోగా పరిచయం కాబోతోన్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి ప్రత్యేక విశేషాలు ప్రదీప్​ మాటల్లోనే తెలుసుకుందాం.

బుల్లితెరపై ప్రేక్షకులను నవ్వించే ప్రదీప్​.. ఈ సినిమాలోని ఎమోషనల్​ సీన్స్​లో ఎలా నటించారు?

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' షూటింగ్​ను ముందుగా సరదా సన్నివేశాలతో ప్రారంభించాం. ఆ తర్వాత ఎమోషనల్​ సీన్స్ షూట్​ చేశాం. ఆ సన్నివేశాలు చిత్రీకరించే రోజు పూర్తిగా ప్రిపేర్​ అయ్యి సెట్​కు వెళ్లేవాడ్ని. అయితే ఈ సినిమా ప్రారంభంలోని 10 నిమిషాలు కీలకం. దాన్ని చూడకపోతే కథ అర్థంకాదు.

ఈ సినిమా షూటింగ్​లో గాయమైందట?

షూటింగ్​లో చివరిరోజున అలా నడుస్తూ కిందపడ్డాను. అప్పుడు కాలికి గాయమైంది. అది పెద్దదై సర్జరీకి దారితీసింది. దాని తర్వాత మూడు నెలలు బ్రేక్​ తీసుకున్నా. అంతా అయోమయంగా ఉన్నా ఆ సమయంలో. ఇప్పటికీ ఆ నొప్పి నుంచి కోలుకుంటున్నా. ఎక్కువసేపు నిల్చోవద్దని వైద్యులు చెప్పారు. అలా కాలునొప్పి అని సాకు చెప్పకుండా.. ప్రతిరోజు నా పనులు నేను చేసుకుంటున్నా.

తొలి దర్శకుడితో మీ అనుభవం ఎలా ఉంది?

దర్శకుడిగా మున్నా తనను తాను నిరూపించుకోవడం సహా నన్ను నేను నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం అనిపించింది. అందుకే అతడిని నమ్మాను. నా కంటే దర్శకుడు చాలా కసితో ఈ సినిమా కోసం పనిచేశారు.

అమ్మ సెంటిమెంట్​తో ఓ సన్నివేశం ఉందట?

అమ్మతో ప్రతి కొడుకు కనెక్ట్​ అయ్యే సన్నివేశం అది. దాని తర్వాత చిత్రంలోని హీరోహీరోయిన్ల మధ్య అప్పటివరకు ఉన్న ఫీలింగ్స్​ పూర్తిగా మారిపోతాయి. సినిమాకు అదే టర్నింగ్​ పాయింట్​.

ఇంతకు ముందు ఏమైనా సినిమాల్లో హీరోగా అవకాశాలు వచ్చాయా?

ఇంతకుముందు చాలా కథలు వచ్చాయి. అయితే అవి నాకు కనెక్ట్​ కాలేదు. ఆ కథల్లో ప్రాణం లేకపోవడం లేదా హీరో అవ్వాలని నాకు ఆ సమయంలో అనిపించకపోవడం వంటి కారణాల వల్ల ఆ సినిమాలు చేయలేదు.

ప్రొమోషనల్​ సాంగ్​ గురించి?

ఫ్రెండ్స్ అందరూ కలిసి పాడుకునే పాట కావాలని అనూప్​ రూబెన్స్​ను అడిగాం. ముందు ఒక పేరా రాశాం. అలా ఒక పేరా నుంచి పాటగా మార్చాం. విశేషమేమిటంటే ఈ ప్రొమోషనల్​ సాంగ్​ చిత్రీకరణను సింగిల్​షాట్​లో పూర్తిచేశాం.

మీ ఫస్ట్​లవ్ గురించి చెప్పగలరా?

మూడో తరగతిలో నా ఫస్ట్​లవ్​. అది తెలిసి తెలియని వయసు. ఏదో అలా జరిగిపోయింది. హీరోయిన్​ సోనాలీ బింద్రే అంటే చాలా ఇష్టం. ​ఆమె సినిమాల్లోని పాటలు టీవీలో వస్తే కళ్లు ఆర్పకుండా చూసేవాడ్ని.

లాక్​డౌన్​లో సేవలు చేశారు కదా?

చాలా మంది సినీకార్మికులకు షూటింగ్​ ఉంటేనే పూట గడుస్తుంది. లాక్​డౌన్​లో చాలామంది నిత్యావసర వస్తువులు లేక చాలా బాధపడ్డారు. అలా ఉన్న కొన్ని కుటుంబాలకు సాయం చేయగలిగాను. సోషల్​మీడియాలో చాలామంది విద్యార్థులు బుక్స్​ కావాలని అడిగితే వారి కోసం ఆన్​లైన్​లో ఆర్డర్​ పెట్టి వాళ్ల అడ్రస్​కు పంపిన సందర్భాలున్నాయి.

చిత్రపరిశ్రమలో ఏ దర్శకుడితో పనిచేయాలని ఉంది?

ఎప్పటికైనా ఇండస్ట్రీలో ఓ స్థాయికి ఎదగాలి. ఆ తర్వాత త్రివిక్రమ్​, సుకుమార్​ వంటి దర్శకులతో సినిమా చేయాలని ఉంది.

ఇదీ చూడండి:'చిరంజీవి, రవితేజ నుంచి చాలా నేర్చుకున్నా'

Last Updated : Jan 28, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details