తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మిస్​ యూ నాన్న!'.. యాంకర్​ ప్రదీప్ భావోద్వేగపు పోస్ట్​

బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్​ మాచిరాజు తండ్రి పాండురంగ(65) ఇటీవలే కరోనా కారణంగా మరణించారు. అయితే తన తండ్రి జ్ఞాపకాల్లో నుంచి ప్రదీప్​ బయటకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంతో తండ్రితో తనకున్న అనుబంధాన్ని ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకున్నారు.

anchor pradeep emotional post on his father
'మిస్​ యూ నాన్న!'.. యాంకర్​ ప్రదీప్ భావోద్వోగపు పోస్ట్​

By

Published : May 23, 2021, 10:20 PM IST

తండ్రే తన సూపర్‌ హీరో అంటూ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా కారణంగా తన తండ్రి పాండురంగ(65) మూడు వారాల కిందట తుదిశ్వాస విడిచారు. అయితే.. తన తండ్రిని జ్ఞాపకాల్లో నుంచి ప్రదీప్‌ బయటకు రాలేకపోతున్నారు. తండ్రితో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేశారు. తన తండ్రి గొప్పతనాన్ని, వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

"ఐ లవ్‌ యూ నాన్న.. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణమైన నీకు థాంక్యూ. నాకు గౌరవ మర్యాదలతో బతకడం నేర్పినందుకు థాంక్యూ నాన్న.. నేను ఇప్పుడు చేసేదంతా మీ గొప్పతనమే.. ఇదంతా మీకే అంకితం. నా కోసం మీరు అనుక్షణం నిలబడ్డారు. నేను చెడ్డ దారి ఎంచుకుంటే మీరు నన్ను సరిదిద్దారు. నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. మీ ప్రేమకంటే గొప్పది మరొకటి లేదు. మీరు నాకెప్పుడూ ప్రత్యేకమే. నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్లినా.. ఎంత ఎదిగినా.. మిమ్మల్ని ప్రేమతో గుర్తుంచుకుంటా. మీరు ఎప్పుడూ కోరుకున్నట్లే.. నేను ఇకమీదట కూడా ప్రజలకు వినోదం పంచుతూ ఉంటా(మళ్లీ మనం కలిసే వరకూ). మిస్‌ యూ నాన్న."

- ప్రదీప్​ మాచిరాజు, బుల్లితెర యాంకర్​, హీరో

తల్లిదండ్రులతో యాంకర్​ ప్రదీప్​

ప్రదీప్​ భావోద్వేగపు పోస్టుపై యాంకర్​ అనసూయ సహా పలువురు నెటిజన్లు స్పందించారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న ప్రదీప్​కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

ఇదీ చూడండి..రికార్డు స్థాయి బిజినెస్​తో బాలయ్య 'అఖండ​'!

ABOUT THE AUTHOR

...view details