తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అనసూయకు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో కీలక పాత్ర - anchor Anasuya To Act With Ravi Teja In 'Khiladi' movie

రవితేజ 'ఖిలాడి' చిత్రంలో అనసూయకు ఛాన్స్ దక్కింది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 28న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

Anasuya To Act With Ravi Teja In 'Khiladi'
అనసూయకు బంపర్ ఆఫర్

By

Published : Feb 3, 2021, 12:40 PM IST

'జబర్దస్త్' యాంకర్​ అనసూయ.. అద్భుత అవకాశం సొంతం చేసుకుంది. మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' సినిమాలో కీలక పాత్ర కోసం ఈమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించడం సహా పోస్టర్​ను విడుదల చేశారు. ఈమెతో పాటే అర్జున్, ఉన్ని ముకుందన్ లాంటి ప్రముఖ నటులు ఇందులో ప్రధాన పాత్రల్లో సందడి చేయనున్నారు.

ఖిలాడి సినిమాలో అనసూయకు అవకాశం

సంక్రాంతి పండగకు 'క్రాక్'​తో వచ్చి హిట్​ కొట్టిన రవితేజ.. ఈ సినిమాతో ఆ ఊపు కొనసాగించాలని చూస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది మే 28న థియేటర్లలోనే విడుదల కానుంది.

ఇది చదవండి:మరో ఐటెంసాంగ్​లో అనసూయ స్టెప్పులు!

ABOUT THE AUTHOR

...view details