తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Anasuya Father died: అనసూయ ఇంట్లో విషాదం - జబర్దస్త్​ అనసూయ తండ్రి మృతి

Anasuya Father died: వ్యాఖ్యాత, సినీ నటి అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన రావు(63) కన్నుమూశారు.

Anchor Anasuya Father died
అనసూయa కుటుంబం

By

Published : Dec 5, 2021, 11:23 AM IST

Updated : Dec 5, 2021, 11:42 AM IST

Anasuya Father died: ప్రముఖ వ్యాఖ్యాత, సినీనటి అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కస్బా అనారోగ్యంతో కన్నుమూశారు. 63 ఏళ్ల సుదర్శన్ రావు కొంతకాలం నుంచి క్యాన్సర్​తో పోరాడుతున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలో తార్నాకలోని నివాసంలో సుదర్శన్ రావు తుదిశ్వాస విడిచారు. దీంతో అనసూయ కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అనసూయ తండ్రి మృతి

వ్యాపార రంగంలో స్థిరపడిన సుదర్శన్ రావు... రాజీవ్ గాంధీ కాలంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు. తన తల్లికి గుర్తుగా ఆమె పేరునే అనసూయకు పెట్టారు. సుదర్శన్ రావుకు అనసూయతోపాటు మరో కుమార్తె ఉంది. కాగా, అనసూయ డిసెంబరు 17న 'పుష్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే 'ఆచార్య', 'భీష్మ పర్వం', 'ఖిలాడి', 'పక్కా కమర్షియల్',​' రంగ మార్తాండ' సినిమాల్లో నటిస్తోంది.

అనసూయ కుటుంబం
అనసూయ కుటుంబం

ఇదీ చూడండి: స్టైలిష్​గా శిల్పాశెట్టి.. హాట్​గా నిధి అగర్వాల్​

Last Updated : Dec 5, 2021, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details