హీరో రామ్‌చరణ్-దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన 'రంగస్థలం' విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో నటి, వ్యాఖ్యాత అనసూయ 'రంగమ్మత్త'గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోని విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగా తన కోసం చెర్రీ ప్రత్యేకంగా చెఫ్‌ను పిలిపించి వంట చేయించారని చెప్పుకొచ్చింది.
"ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో చేపల కూర తినాలి. కానీ అవి తినే అలవాటు నాకు లేదు. ఇది తెలిసిన చెర్రీ నాకోసం ప్రత్యేకంగా చెఫ్‌ను పిలిపించి పన్నీర్‌ను పెద్ద ముక్కలుగా కట్ చేయించి వండించారు. అది చేప కూర రుచిని పోలి ఉంది. స్టార్ హీరో స్థాయిలో ఉన్న ఆయన నాకోసం అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ అలా చెఫ్‌తో ప్రత్యేకంగా వంట చేయించడం చాలా సంతోషాన్నిచ్చింది" అని జ్ఞాపకాలను నెమరువేసుకుంది.