తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ కోసం రంగంలోకి దిగిన 'రంగమ్మత్త'! - అల్లు అర్జున్-విజయ్ సేతుపతి

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్​లో రానున్న కొత్త సినిమాలో నటి, వ్యాఖ్యాత అనసూయ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం.

బన్నీ కోసం రంగంలో దిగిన 'రంగమ్మత్త'!
అనసూయ-అల్లు అర్జున్

By

Published : Jan 19, 2020, 5:18 AM IST

Updated : Jan 19, 2020, 3:50 PM IST

'అల వైకుంఠపురములో' విజయంతో ఫుల్​జోష్​లో ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తర్వాత సుకుమార్ సినిమాలో నటించనున్నాడు. త్వరలో షూటింగ్​కు హాజరు కానున్నాడు. ఈలోపు హీరో ఉండని కీలక సన్నివేశాలను తీస్తోంది చిత్రబృందం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్​లో చర్చనీయాంశమైంది. ఇందులో నటి అనసూయ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ సినిమా తీస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 'శేషాచలం' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నారు. కథంతా శేషాచలం అడవుల చుట్టూనే తిరుగుతుందని, అందువల్ల ఈ టైటిల్​ ఖరారు చేస్తే బాగుంటుందని సుక్కు ఆలోచన.

అల్లు అర్జున్ కొత్త సినిమా పోస్టర్

ఇందులో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తుంది. విజయ్ సేతుపతి విలన్​గా కనిపించనున్నాడు. బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ కీలక పాత్రలో దర్శనమివ్వనుందని తెలుస్తోంది. ఇంతకుముందు సుకుమార్ 'రంగస్థలం'లో రంగమ్మత్తగా మెప్పించింది అనసూయ. ఆమె నటనకు విమర్శకుల నుంచీ ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇందులోనూ ఒక మంచి పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం.

Last Updated : Jan 19, 2020, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details