'మా' ఎన్నికల్లో విచిత్రం జరిగింది! ఆదివారం ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు చెందిన అనసూయ గెలిచిందని అన్నారు. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో మాత్రం ఆమె పేరు కనిపించలేదు. దీంతో అవాక్కవడం అనసూయ వంతైంది. ఈ విషయమై ఆమె ట్వీట్ కూడా చేసింది.
'మా' ఎన్నికల్లో అనసూయ సంచలనం.. నిన్న గెలిచి.. నేడు ఓడి - anasuya news
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అనసూయకు చుక్కెదురైంది. ఆదివారం గెలిచిందని చెప్పగా, సోమవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో మాత్రం ఆమె పేరు కనిపించలేదు.
"క్షమించాలి. ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొస్తోంది. మీతో పంచుకుంటున్నా. ఏమనుకోకండే..! నిన్న "అత్యధిక మెజార్జీ", "భారీ మెజార్జీ"తో గెలుపు అని.. ఈరోజు "లాస్ట్","ఓటమి" అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందబ్బా. అసలు ఉన్న సుమారు 900 ఓటర్స్‌లో 600 చిల్లర ఓటర్ల లెక్కింపునకు రెండో రోజుకి వాయిదా వేయాల్సినంత టైమ్ ఎందుకు పట్టిందంటారు? అహా ఏదో అర్ధం కాక అడుగుతున్నాను. నిన్న ఎవరో ఎన్నికల నియమాలకి భిన్నంగా బ్యాలెట్ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు" అని ట్వీట్ చేసింది.
"నేను ఇంతవరకు పాలిటిక్స్‌లో లేను. ఒకవేళ వాటిలో ఉంటే నిజయాతీగా ఉండలేం. ఇప్పుడు నాకు అంత టైమ్ కూడా లేదు. దాని కంటే పిల్లల్ని చూసుకుంటాను" అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.