యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ. ఈ 'జబర్దస్త్' నటి హీరోయిన్గా తెరకెక్కుతోన్న సినిమా 'కథనం'. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో మూవీ రూపొందినట్లు తెలుస్తోంది.
ట్రైలర్: ఆసక్తికరంగా అనసూయ 'కథనం' - avasarala srinivas
'జబర్దస్త్' ఫేం అనసూయ హీరోయిన్గా నటించిన చిత్రం 'కథనం'. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలై అభిమానుల్ని.. ఆకట్టుకుంటోంది.
ట్రైలర్: ఆసక్తికరంగా అనసూయ 'కథనం'
గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి బత్తెపాటి, శర్మ చుక్క సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ధన్‌రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాలో అనసూయ యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించింది. సీనియర్ హీరో పృథ్వీరాజ్ ప్రతినాయకుడి పాత్ర చేశాడు. రోషన్ నేపథ్య సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది.