Anasuya movies: 'జబర్దస్త్' యాంకర్ అనసూయ.. 'ఖిలాడి'తో కలిసి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 11 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఇందులో అనసూయ పాత్రకు సంబంధించిన క్రేజీ విషయం బయటకొచ్చింది.
ఇప్పటివరకు పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన అనసూయ.. 'ఖిలాడి'లో ద్విపాత్రాభినయం చేసిందట. అందులో ఒకటి బ్రహ్మణ అమ్మాయి చంద్రకళ అని తెలుస్తోంది. మరో అనసూయ పాత్ర చనిపోతుందని సమాచారం. అలానే ఈ సినిమా అనసూయ చాలా గుర్తింపు తీసుకురానుందని చెబుతున్నారు.