రంగమ్మత్తగా ‘రంగస్థలం’లో అనసూయ నటనను మర్చిపోలేం. తన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఆ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది అనసూయ.
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. గతంలో అనసూయ ఈ చిత్రంలో నటిస్తుందని వార్తలొచ్చాయి కానీ అధికారిక ప్రకటన లేదు. తాజాగా దర్శకుడు కృష్ణవంశీ అనసూయ ఫొటోను షేర్ చేస్తూ ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యను జోడించడం వల్ల స్పష్టత వచ్చింది.