తన డ్రెస్సింగ్ తీరుపై ఓ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు నటి అనసూయ. ఆయన పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు.
"ఇటీవల ఓ సీనియర్ నటుడు నాపై కొన్నికామెంట్స్ చేశారని తెలిసింది. ఆయన నా వస్త్రధారణ గురించి మాట్లాడారు. అలాంటి అనుభవమున్న వ్యక్తి అలా మాట్లాడటం అనేది చాలా బాధను కలిగించింది. ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం, వృతిపరమైన పరిస్థితులను అనుసరించి కూడా అలా చేయవచ్చు. అది వారి స్వవిషయం. సోషల్మీడియా అలాంటి వార్తలను మరింతగా ప్రచారం చేస్తుంది. కానీ ఓ సీనియర్ నటుడు మందు తాగుతూ, అధ్వానమైన దుస్తులను ధరించి, తెరపై స్త్రీలను కించపరిచిన సన్నివేశాలల్లో నటించినా వారిని ఎందుకు పట్టించుకోరో ఆశ్చర్యకరంగా ఉంది."