తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవర్​స్టార్​ కొత్త సినిమాలో రంగమ్మత్తకు ఛాన్స్..!​ - పవన్​ కల్యాణ్​

బుల్లితెర అందాల యాంకర్​ అనసూయ భరద్వాజ్‌ మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందా? మరోసారి మెగా హీరోతో నటించనుందా? అనే ప్రశ్నలకు అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు.

anasuya-bhardwaj-key role-in-pawan kalyan-Krish-Movie
పవర్​స్టార్​ కొత్త సినిమాలో రంగమ్మత్తకు ఛాన్స్​

By

Published : Feb 4, 2020, 4:39 PM IST

Updated : Feb 29, 2020, 3:59 AM IST

'క్షణం'తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు 'రంగస్థలం' సినిమాతో భారీ బ్రేక్‌ వచ్చింది. ఇప్పుడీ భామ రెండు మెగా ఛాన్స్‌లు కొట్టేసినట్లు సమాచారం అందుతోంది. అల్లుఅర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రంతో పాటు, పవర్‌స్టార్‌ కొత్త సినిమాలోనూ నటించే అవకాశం దక్కించుకుందని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

'పింక్‌' రీమేక్‌ తర్వాత పవన్‌ హీరోగా.. క్రిష్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ చిత్రం తెరకెక్కనుంది. దీనిని మొఘలాయుల కాలం నాటి కథతో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిస్తారని సమాచారం. ఇందులో పవన్‌ రాబిన్‌ హుడ్‌ తరహా పాత్రలో కనిపించనుండగా.. అతడికి సహాయపడే ఓ కీలక పాత్రలో అనసూయ నటించనుందట. ఇప్పటికే ఈ పాత్ర చేయడానికి ఆమె ఒకే చెప్పినట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణను మార్చిలో ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చూడండి..'మైదాన్​' సినిమా విడుదల తేదీలో మార్పు

Last Updated : Feb 29, 2020, 3:59 AM IST

ABOUT THE AUTHOR

...view details