Pushpa: 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా విమర్శకులు ప్రశంసలు అందుకుంది నటి, యాంకర్ అనసూయ. సుకుమార్ దర్శకత్వంలోనే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' సినిమాలో ద్రాక్షయనిగా మెరిసింది. అయితే పుష్ప తొలి భాగం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండగా, అందులో అనసూయ పాత్ర నిడివి తక్కువగానే ఉందని ప్రేక్షకులు అంటున్నారు. కానీ, పార్ట్-2లో మాత్రం ఆమె పాత్ర కీలకంగా మారనుందని తెలుస్తోంది. ఫహాద్ ఫాజిల్‌తో కలిసి పుష్పరాజ్‌పై ప్రతీకారం తీర్చుకునే విధంగా ద్రాక్షయని పాత్రను రూపొందిస్తున్నారట సుకుమార్.
'పుష్ప' సినిమాకు అనసూయ పారితోషికం ఎంతంటే? - SUKUMAR ANASUYA MOVIES
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'లో ద్రాక్షాయని పాత్రలో మెరిసింది నటి, యాంకర్ అనసూయ. పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా.. మంగళం శ్రీను భార్యగా నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు ఆమెకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే?
పుష్ప
'పుష్ప'లో మంగళం శ్రీను భార్యగా నటించింది అనసూయ. ఆమె ఆహార్యం కూడా వైవిధ్యంగా ఉంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు 10 రోజుల పైగా షూటింగ్ పాల్గొన్న అనసూయ.. రోజుకు సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. 'పుష్ప: ది రైజ్' పేరుతో పార్ట్ 2 తెరకెక్కనుంది. ఫిబ్రవరి-మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి:'సెకండ్ హ్యాండ్ ఐటెమ్'.. ట్రోల్‌పై స్పందించిన సమంత
Last Updated : Dec 23, 2021, 7:26 PM IST