తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విలన్​ పాత్రలో మెప్పించనున్న రంగమ్మత్త..! - anasuya news

రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేసిన యాంకర్​ అనసూయ.. ఇప్పుడు మరో కొత్త పాత్రలో తెరపై కనిపించనుందని సమాచారం. విజయ్​ దేవరకొండ నిర్మించే కొత్త సినిమాలో ఓ కీలకపాత్ర పోషించబోతుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

anasuya-anasuyabharadwaj-vijaydevarakonda
విలన్​ పాత్రలో మెప్పించనున్న రంగమ్మత్త..!

By

Published : Feb 18, 2020, 6:48 AM IST

Updated : Mar 1, 2020, 4:43 PM IST

బుల్లితెర నుంచి వెండితెరపై అడుగుపెట్టి నటిగా గుర్తింపు పొందింది యాంకర్​ అనసూయ. 'రంగస్థలం' చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఆమెలోని నటిని మరో స్థాయికి తీసుకెళ్లింది. నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసింది. ఇప్పుడు ప్రతినాయకురాలిగా కనిపించనుందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నిర్మించనున్న కొత్త చిత్రంలో అనసూయకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాలో అనసూయ విలన్‌గా కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

గతంలో తరుణ్‌ భాస్కర్‌ హీరోగా విజయ్‌ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' చిత్రంలో కీలక పాత్ర పోషించింది అనసూయ. ప్రస్తుతం సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది.

ఇదీ చూడండి.. నాగ్​ అశ్విన్​తో ప్రభాస్​ కొత్త చిత్రం..!

Last Updated : Mar 1, 2020, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details