తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రంగమ్మత్త'లానే 'పుష్ప'లో పాత్ర కూడా: అనసూయ - movie news latest

'పుష్ప' సినిమాలో తన మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్​ సుకుమార్​కు ధన్యవాదాలు చెప్పారు అనసూయ. అది ప్రేక్షకులకు కచ్చితంగా ఆకట్టుకుంటుందని అన్నారు. ఈమె నటించిన 'థాంక్యూ బ్రదర్'.. ఓటీటీలో శుక్రవారం విడుదల కానుంది.

Anasuya about her role in Pushpa movie
అనసూయ

By

Published : May 7, 2021, 5:31 AM IST

తనపై నమ్మకం ఉంచినందుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు నటి అనసూయ కృతజ్ఞతలు చెప్పారు. యాంకర్​గా సుపరిచితమైన ఈమె అనతికాలంలోనే 'రంగస్థలం'తో రంగమ్మత్తగా ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు. ఆమె నటించిన ‘థ్యాంక్యూ బ్రదర్‌’ త్వరలో ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘థ్యాంక్యూ బ్రదర్‌’ లాంటి విభిన్న కథా చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం ‘పుష్ప’లో భాగం కావడం గురించి మాట్లాడారు.

"ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తీసిన 'రంగస్థలం' చిత్రంలోని రంగమ్మత్త పాత్ర నాకెంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర ఎంతోమందికి నచ్చింది. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న 'పుష్ప'లోనూ నాకు ఓ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో నా పాత్ర గురించి ఇప్పుడే బయటకు చెప్పలేను. రంగమ్మత్త ఎంతలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందే అదేమాదిరిగా ఈ పాత్ర ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. నాపై నమ్మకం ఉంచి ఇలాంటి మంచి పాత్రల్లో అవకాశం కల్పించిన సుకుమార్‌ సర్‌కు కృతజ్ఞతలు' అని అనసూయ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details