'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2', 'పతి పత్నీ ఔర్ ఓ', 'కాలీ పీలీ' చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య పాండే. ఇప్పుడు ఈ భామ నటిస్తున్న చిత్రం 'లైగర్'. విజయ్ దేవరకొండ కథానాయకుడు, పూరీ జగన్నాథ్ దర్శకుడు. అయితే ఈ పాన్ ఇండియా సినిమాలో నటించడంపై అన్యన్య స్పందించింది.
విజయ్‌తో సినిమా.. నాలుగురెట్లు ఆత్రుతతో అనన్య - విజయ్ దేవరకొండ లేటేస్ట్ న్యూస్
'లైగర్' సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆత్రుతతో ఉన్నట్లు అనన్య పాండే తెలిపింది. పలు భాషల ప్రేక్షకుల్ని పలకరించనుండటం గౌరవంగా ఉందని చెప్పింది.
విజయ్‌తో సినిమా.. నాలుగురెట్లు ఆత్రుతతో అనన్య
"రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాను. 'లైగర్'తో మరో నాలుగు భాషల్లో ఒకేసారి వెళ్లే అవకాశం దక్కింది. బాలీవుడ్ ఎంట్రీ కంటే ఇప్పుడు నాలుగు రెట్లు ఆత్రుతగా ఉంది. ఇప్పుడు హద్దులు చెరిగిపోయాయి. ఓటీటీ వేదికలు వచ్చాకా అన్ని భాషల్లోని చిత్రాలకు మంచి అవకాశం దక్కింది ఒకేసారి ఇన్ని భాషల ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను"అని అనన్య చెప్పింది. 'లైగర్'తో పాటు దీపికా పదుకొణె, సిద్ధాంత్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది అనన్య.