తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రగ్స్ గురించి ఆర్యన్​తో జోక్ చేశా: అనన్య పాండే - అనన్య పాండే లేటెస్ట్ న్యూస్

హీరోయిన్ అనన్య పాండే.. డ్రగ్స్​ కేసులో పలు విషయాలు చెప్పింది. ఆర్యన్​ చాట్​లో భాగంగా డ్రగ్స్ గురించి జోక్ చేశానని తెలిపింది.

ananya pandey aryan khan
అనన్య పాండే ఆర్యన్ ఖాన్

By

Published : Oct 22, 2021, 2:15 PM IST

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న క్రూయిజ్‌ నౌకపై డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హీరోయిన్ అనన్య పాండే పేరు తెరపైకి వచ్చింది. నిన్న ఆమెను ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో ఆర్యన్‌ ఖాన్‌తో డ్రగ్స్‌ చాట్‌ గురించి అధికారులు ఆమెను ప్రశ్నించగా.. తాను జోక్‌ చేశానని అనన్య చెప్పినట్లు సమాచారం.

డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ జరిపిన వాట్సాప్‌ చర్చల్లో అనన్య పేరు రావడం వల్ల అధికారులు ఆమె నివాసానికి గురువారం వెళ్లి సమన్లు జారీ చేశారు. దీంతో ఆమె ఆ రోజు మధ్యాహ్నం ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అనన్యను ప్రశ్నించిన అధికారులు.. ఆర్యన్‌తో వాట్సాప్‌ చాట్‌ గురించి ఆరా తీశారు.

అనన్య పాండే

వీరిద్దరి మధ్య గంజాయి కోసం వాట్సాప్‌ చర్చ జరిగిందని ఎన్‌సీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గంజాయి కోసం ఆర్యన్‌ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్‌లో ఉందని సమాచారం. ఈ చాట్‌ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్‌ చేశానని అనన్య చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయితే ఆర్యన్‌ కోసం అనన్య డ్రగ్స్‌ పంపించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది.

విచారణకు ముందు కన్నీళ్లు పెట్టుకుని..

ఎన్‌సీబీ విచారణ నిమిత్తం అనన్య, తన తండ్రి చుంకీ పాండేతో కలిసి కార్యాలయానికి వచ్చింది. అయితే ఇంటరాగేషన్‌ గదికి వెళ్లేందుకు ఆమె చాలా ఆందోళనకు గురైందని, ఒక దశలో కన్నీళ్లు కూడా పెట్టుకుందని సదరు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం కూడా రావాలని అధికారులు ఆమెను సూచించారు. అయితే ఇప్పటివరకు ఆమె హాజరుకాలేదని సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details