Ananya Panday Liger: టాలీవుడ్లో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమాల్లో బాలీవుడ్ బ్యూటీల హవా పెరిగింది. పూరి జగన్నాథ్ దర్శతక్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్' ఈ కోవకు చెందినదే. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. ఇటీవల ఆమె నటించిన 'గెహ్రాహియా' సినిమా విజయంతో జోష్ మీద ఉన్న అనన్య 'లైగర్'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తొలిసారిగా పాన్ ఇండియా చిత్రంలో నటించిన ఈ భామ.. లైగర్ ఒక పాప్‌కార్న్ మసాలా లాంటి సినిమా అని చెప్పుకొచ్చింది.
"లైగర్ నా తొలి మసాలా సినిమా. నేను చెన్నై ఎక్స్‌ప్రెస్, గోల్మాల్ వంటి వినోదాత్మక చిత్రాలు చూస్తూ పెరిగాను. నాకు కూడా అలాంటి చిత్రాల్లో నటించాలని ఉండేది. డేవిడ్ ధావన్, రోహిత్ శెట్టి, ఫరాఖాన్లకు నేను వీరాభిమానిని. నాకు ఈ లైగర్ ఓ సూపర్ పాప్‌కార్న్ మసాలా సినిమా. ఇందులో యాక్షన్, రోమాన్స్, థ్రిల్లర్, డ్రామా, కామెడీ అన్నీ ఉన్నాయి. అందులోనూ ఇది పాన్ ఇండియా చిత్రం. నేను ఇంతకన్నా ఏమీ ఆశించను."
-అనన్య పాండే, 'లైగర్' హీరోయిన్
విజయ్ సిగ్గరి..