అన్నపూర్ణ స్కాలర్షిప్.. లక్ష రూపాయలు - అక్కినేని అమల
అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా(ఏఐఎస్ఎఫ్ఎమ్) ప్రతిభ కనపరిచిన యువతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల స్కాలర్షిప్ను అందించింది. ఫిల్మ్ అండ్ మీడియాలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు.
లక్ష రూపాయల అన్నపూర్ణ స్కాలర్షిప్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా(ఏఐఎస్ఎఫ్ఎమ్) ప్రత్యేక వేడుక నిర్వహించింది. కార్యక్రమానికి అతిథిగా నటి అక్కినేనిఅమల హాజరయ్యారు. ‘షీ ఇన్స్పైర్స్’ విజేతలను సత్కరించారు.