తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెమ్యునరేషన్​తో రెస్టారెంట్​ పెట్టిన హీరో - మిడిల్​క్లాస్​ మెలొడీస్​

ఇటీవలే 'మిడిల్​క్లాస్​ మెలొడీస్​' చిత్రంతో హిట్​ అందుకున్న టాలీవుడ్​ యంగ్​ హీరో ఆనంద్​ దేవరకొండ.. వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్​లోని ఖాజాగూడలో 'గుడ్​ వైబ్స్​ ఓన్లీ కేఫ్​' రెస్టారెంట్​ను ఏర్పాటు చేశారు.

Anand Deverakonda invests in cafe as a tribute to 'Middle Class Melodies'
'ఆ సినిమా పారితోషకంతోనే రెస్టారెంట్​ పెట్టా'

By

Published : Nov 26, 2020, 9:35 AM IST

యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. 'మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌' చిత్రం పారితోషికంతో బిజినెస్‌ ఆరంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

"మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌' నాకు తొలి పెద్ద విజయాన్ని, చెక్కును ఇచ్చింది. అంతేకాదు మీ ప్రేమ నాలో బలంతోపాటు ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఈ విజయాన్ని పంచుకుంటూ మొదటి అడుగుగా నా స్నేహితుడితో కలిసి ఫుడ్‌ డ్రీమ్స్‌లో పెట్టుబడి పెట్టా. విజయ్‌కు, నాకు సక్సెస్‌ ఇచ్చిన సినిమా కథాంశాలన్నీ ఆహారం-డ్రీమ్స్‌ చుట్టూ సాగినవే. అందుకే నా మొదటి పారితోషికంతో మీకు రుచికరమైన ఆహారం తినిపించాలని, నా స్నేహితులకు సపోర్ట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. మేమంతా ఎన్నో కలలు కంటూ కలిసి పెరిగాం"

- ఆనంద్​ దేవరకొండ, కథానాయకుడు

హోటల్‌కు 'గుడ్‌ వైబ్స్‌ ఓన్లీ కేఫ్‌' పేరు పెట్టినట్టు ఆనంద్‌ దేవరకొండ తెలిపారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో దీన్ని ఏర్పాటు చేశారు.

స్నేహితులతో ఆనంద్​ దేవరకొండ

'దొరసాని' సినిమాతో ఆనంద్‌ హీరోగా కెరీర్‌ ఆరభించారు. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించిన ఇదే సినిమాతో ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక నటిగా అరంగేట్రం చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా నటులుగా ఆనంద్, శివాత్మికకు గుర్తింపు తెచ్చింది. దీని తర్వాత ఆనంద్‌ 'మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌'లో నటించారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details