తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​తో సినిమా చేసే ఆలోచన ఉందా..? - vijay devarakonda with anand

"ఇలాంటి పాత్రలే చెయ్యాలి అని నన్ను నేను ఒక చట్రంలో బంధించుకోవాలి అనుకోవట్లేదు. విభిన్న పాత్రలు, వైవిధ్యభరితమైన కథలు చెయ్యాలని ఉంది" అంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన 'మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌' మరి కొన్నిరోజుల్లో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన సినీ ప్రయాణం గురించి ఆనంద్‌ పంచుకున్న సరదా సంగతులివీ..

anand devarkonda news
విజయ్​తో కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా..?

By

Published : Nov 18, 2020, 4:40 PM IST

'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌'లో రాఘవ అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తా. గుంటూరులో టిఫిన్‌ సెంటర్‌ పెట్టి.. జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంగా జీవిస్తుంటా. కానీ, దీనికి కావాల్సిన డబ్బుండదు. ఈ క్రమంలో నా లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశా? ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగతా కథ. మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది.

ఆనంద్ దేవరకొండ

'దొరసాని' షూటింగ్‌ టైంలోనే దర్శకుడు వినోద్‌ ఈ కథ చెప్పారు. విన్న వెంటనే నాకు తెగ నచ్చేసింది. స్క్రిప్ట్‌ చదివాక.. మధ్యతరగతి జీవితాలు కళ్ల ముందు కదిలినట్లుగా అనిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు ఎంతో చక్కగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. దీంట్లో వినోదం కథలో భాగంగా ఉంటుంది కానీ, ఎక్కడా ఇరికించినట్లు ఉండదు.

ఆనంద్ దేవరకొండ

గుంటూరు యాస కోసం కష్టపడ్డా..

ఈ చిత్రంలోని నా పాత్ర.. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. చిన్నప్పుడు మేమూ మధ్యతరగతి కష్టాలు చాలా చూశాం. కథ వింటున్నప్పుడు అవన్నీ మళ్లీ గుర్తొచ్చాయి. ఈ చిత్రంలో గుంటూరు యాసలో మాట్లాడటం కోసం కష్టపడ్డా. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లే లక్ష్యంగా తెరకెక్కించాం. డిసెంబరు నాటికే చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో థియేటర్లలోకి తీసుకొద్దాం అనుకున్నాం. కానీ, కరోనా పరిస్థితులతో అనూహ్యంగా మా ప్రయాణం ఓటీటీ వైపు మలుపు తీసుకుంది. అమెజాన్‌ ద్వారా విడుదల కావడం వల్ల తెలుగు వాళ్లతో పాటు విదేశాల్లోని ప్రజలు చూడగలిగే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది.

ఆనంద్ దేవరకొండ

చాలా విషయాలు చెబుతుంటాడు

నేనేదైనా కథ వింటే.. 'ఫలానా దర్శకుడు కథ చెప్పాడు.. లైన్‌ ఇది' అని ఒక ఫ్రెండ్‌కి చెప్పినట్లు విజయ్‌కి చెప్తా. అది అంతవరకే. తర్వాత తను ఏమన్నా చెప్పాలనుకుంటే సినిమా చూశాకే చెప్తాడు. ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో.. నటన పరంగా నేనింకేం చెయ్యొచ్చు.. ఇలా చిన్న చిన్న విషయాలు చెప్తుంటాడు. తనకి 'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌' చాలా నచ్చింది.

ఆనంద్ దేవరకొండ
విజయ్​, ఆనంద్​

అది భవిష్యత్తులో నెరవేరొచ్చేమో..

విజయ్, నేను కలిసి చేస్తే బాగుంటుందని ఇంట్లో వాళ్లు, బయట చాలా మంది అనుకుంటారు. మేమైతే ఎప్పుడూ దాని గురించి మాట్లాడుకోలేదు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో చెయ్యొచ్చేమో. కానీ, అదంత ఈజీగా అయిపోదు. ఒకవేళ మేం చెయ్యాల్సి వచ్చినా.. అన్నదమ్ముల్లాగే చెయ్యాల్సి వస్తుందేమో. ఎందుకంటే మా ఇద్దరి రూపు, మాటతీరు ఒకేలా ఉంటాయి.

ఫ్యామిలీతో ఆనంద్​, విజయ్​

కొత్త సినిమా కబుర్లు..

ప్రస్తుతం సృజన్‌ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే నిర్మాణాంతర పనులు మొదలవుతాయి. ఇప్పుడప్పుడే వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్లే ఆలోచన లేదు.

ABOUT THE AUTHOR

...view details