తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విశాల్​ సరసన రితూవర్మ..?

ప్రముఖ దర్శకుడు ఆనంద్ శంకర్​.. హీరో విశాల్​తో ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో రితూవర్మ కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

By

Published : Dec 16, 2019, 11:33 AM IST

an actress rithu varma wil act with hero vishal in his next movie
విశాల్​ సరసన రితూవర్మ..?

ప్రముఖ హీరో విశాల్​ నటించిన 'యాక్షన్'​ చిత్రం విడుదలై ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయంది. తదుపరి సినిమాతోనైనా హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ హీరో. ప్రస్తుతం మిష్కిన్​ దర్శకత్వంలో 'తుప్పరివాళన్​ 2' సినిమాలో నటిస్తున్నాడు. లండన్​లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా 'అరిమానంబి', 'ఇరుముగన్'​ ఫేమ్​ ఆనంద్​ శంకర్​ దర్శకత్వంలో పనిచేయనున్నాడు విశాల్​.

ఈ సినిమాలో రితూవర్మ కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్​ హీరోగా తెరకెక్కిన 'ధ్రువ నక్షత్రం'లో రితూ నటించగా.. రెండేళ్లు దాటుతున్నా ఇప్పటికీ సినిమా విడుదల కాలేదు. మరోవైపు దుల్కర్​ సల్మాన్ ​హీరోగా తెరకెక్కుతున్న 'కన్నుం కన్నుం కొళ్లైయడిత్తాల్​' చిత్రంలోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. విశాల్​ సరసన నటించనుండటం రితూకు ఇదే తొలిసారి. ప్రస్తుతం దర్శకుడు ఆనంద్​ శంకర్​ ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'యూపీ వాడికి తెలుగువాడు యముడిలా కనిపిస్తున్నాడా'

ABOUT THE AUTHOR

...view details