బాలీవుడ్ నటి అమైరా దస్తూర్ జంతువులపై ప్రేమ చూపడంలో ముందుంటుంది. ఆ ప్రేమతోనే ఓ ప్రముఖ జంతు ఆహార ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, పూజా హెగ్దే ఇదే బ్రాండ్‌కు ప్రచారం చేస్తున్నారు.
అమైరా దస్తూర్ తన ఇంటి చుట్టుపక్కల ఉండే 15-20 పిల్లులకు సరైన ఆహారం ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ప్రచారం చేస్తున్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, తనకు వచ్చే పారితోషకంలో 20 శాతం వాటి ఆహారం కోసం కేటాయించింది.
"జంతువులను ప్రేమించటం మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. మా కుక్కలు, పిల్లులను ఆమె ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. పిల్లుల ఆహారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం చాలా ఆనందాన్నిస్తుంది. మన దేశంలో వీధి జంతువులను అంత ప్రేమగా చూడరు. కాబట్టి వాటికి నేను వీలైనంత సాయం చెయ్యాలని ప్రయత్నిస్తున్నా'. - అమైరా దస్తూర్, హీరోయిన్
కంగనా రనౌత్- రాజ్‌కుమార్ రావ్ నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా'లో అమైరా ఓ పాత్రలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదలకానుంది.
ఇది సంగతి: మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!