నిత్యం సినిమాలు... షూటింగులు అంటూ బిజీగా ఉండే రోజుల్లోనే సామాజిక మాధ్యమాల్లో ఎంతో సందడి చేస్తుంటుంది అందాల తార అమీ జాక్సన్. ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో మరింతగా అభిమానుల్ని అలరిస్తోంది.
అమీ జాక్సన్ వ్యాయామ విన్యాసాలకు అభిమానులు ఫిదా - అమీ జాక్సన్ వార్తలు
లాక్‌డౌన్ వేళ తను వ్యాయామం చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది అందాల తార అమీ జాక్సన్. కొత్త కొత్త విన్యాసాలు చేయటం అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలిపింది.
ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొనే ఈ బ్రిటిష్ బామ ఎప్పటికప్పుడు వర్కవుట్లకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఓ వ్యాయామ విన్యాసం చేస్తున్న ఫొటోను ట్వీట్ చేసింది. ‘"నాకు కొత్త విన్యాసాలు చేయడం అంటే చాలా ఇష్టం" అంటూ ట్వీటింది.
అమీ కొత్త విన్యాసాన్ని చూసిన నెటిజన్లు.. "వావ్ అమీ" అంటూ పొగిడేస్తున్నారు. అమీ ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తల్లి అయినా అమీ అందం తగ్గలేదు అంటూ కొందరు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. తమ అభిమానుల్ని ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరి శైలిలో వాళ్లు అలరిస్తున్నారు