'మద్రాసు పట్టణం', '2.0' (రోబో) లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న నటి అమీ జాక్సన్.. లాక్‌డౌన్ కారణంగా తనయుడితో కలిసి సరదాగా గడిపేస్తుంది. అంతేకాదు అమీ ఆండ్రియాన్‌ను 'బన్నీ' అనీ ముద్దుగా పిలుస్తోంది. తాజాగా కుమారుడితో కలిసి వ్యాయామం చేస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
అమీ జాక్సన్‌కు చెమటలు పట్టించిందెవరు? - అమీ జాక్సన్ కుమారుడు న్యూ స్
నటి అమీ జాక్సన్.. నెలల వయసున్న తన కుమారుడితో కలిసి వ్యాయామం చేస్తున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమీ
దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు "మీ ఇద్దరిలో ఎవరికెవరు చెమటలు పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమందైతే "మీ అబ్బాయిని అప్పుడే పెద్దవాణ్ని చేయాలని చూస్తున్నారా?" అని రాసుకొస్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలో ఇంటి నుంచి పనిచేస్తే ఎన్నో లాభాలున్నాయని చెబుతోంది అమీ జాక్సన్. తెలుగులో రామ్ చరణ్‌తో 'ఎవడు'లో కలిసి నటించింది. ప్రస్తుతం తన భర్త జార్జ్ పనాయోటౌతో కలిసి సరదాగా గడుపుతోంది.
Last Updated : May 26, 2020, 7:36 AM IST