నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్(amrutha pranay latest updates) హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అతని భార్య అమృత ప్రణయ్‌కు పలువురు మద్దతుగా నిలవగా.. మరికొందరు తీవ్రంగా విమర్శించారు(amrutha pranay latest news). అయితే ఇప్పుడు ఆమె చాలా కాలం తర్వాత తొలిసారి ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె లుక్‌ను చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
ఇంతకీ ఈ సాంగ్ ఏంటంటే?
నటి లాస్య(anchor lasya).. దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో సాంగ్‌తో అభిమానులను అలరించారు. ఆ వీడియోలోనే అమృత ప్రణయ్‌తో కలిసి ఆమె కాలు కదపడం విశేషంగా నిలిచింది. వీరిద్దరితో పాటు గలాటా గీతూ, అలేఖ్య కూడా సందడి చేశారు. నవంబర్ 3న పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనికి విపరీతంగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
ఈ సాంగ్‌లో లాస్య తనదైన స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకోగా, అమృత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా అమృత పోస్ట్ చేశారు. చాలా కాలం తర్వాత ఆమెను మళ్లీ ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ కొందరూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరూ మాత్రం విమర్శిస్తున్నారు.
ఇదీ చూడండి: యాంకర్ సుమ రీఎంట్రీ.. ఫస్ట్‌లుక్‌తో భారీ అంచనాలు