తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: అమితాబ్​

గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్ర ప్రారంభోత్సవానికి బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ చేతుల మీదుగా సూపర్​ స్టార్​ రజనీకాంత్​కు ఐకాన్​ ఆఫ్​ గోల్డెన్​ జూబ్లీ అవార్డును అందజేశారు.

అమితాబ్​ చేతుల మీదుగా రజినీకాంత్​కు అత్యున్నత పురస్కారం

By

Published : Nov 20, 2019, 9:02 PM IST

50వ అంతర్జాతీయ చలన చిత్ర ప్రారంభోత్సవం(ఐఎఫ్​ఎఫ్​ఐ) అంగరంగ వైభవంగా సాగింది. గోవాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్ ​బచ్చన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల ఆప్యాయతల నడుమ అమితాబ్​ బచ్చన్​కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

''నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. నా ప్రతి ఓటమి, గెలుపులో మీరు వెన్నంటే ఉన్నారు. మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని నేను ఎప్పటికీ చెల్లించలేను. మీ ప్రేమ నాతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, రచయితలు, దర్శకులు, నిర్మాతలు వీరంతా కారణం.''

-అమితాబ్​ బచ్చన్, బాలీవుడ్​ హీరో

భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి ఫలితంగాఈ ఏడాది సెప్టెంబర్‌లోఅమితాబ్​ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ సినిమాల్లో ఒక కళాకారుడికి ఈ పురస్కారాన్ని అత్యున్నత గౌరవంగా భావిస్తారు.

అమితాబ్​ చేతుల మీదుగా రజినీకాంత్​కు అత్యున్నత పురస్కారం
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సూపర్​స్టార్​ రజనీకాంత్​.. అమితాబ్​ చేతుల మీదుగా ఐకాన్​ ఆఫ్​ గోల్డెన్​ జూబ్లీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు స్పూర్తినిచ్చిన అమితాబ్​ బచ్చన్​కు కృతజ్ఞతలు తెలిపారు రజనీ. వీరి కలయికలో హమ్​, అందా కనూన్​, గెరాఫ్టార్​ వంచి చిత్రాలు వచ్చాయి.

''ఈ అవార్డు దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవార్డును ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవార్డును నాతో సినిమా చేసిన దర్శకులు, నిర్మాతలు, అందరు సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నాను. నన్ను ఎంతగానే ఆదరించిన నా అభిమానులకు నా అభినందనలు.''

-రజనీకాంత్​, సినీ హీరో

అభిమానులు ముద్దుగా తలైవా అని పిలిచే రజనీకాంత్​ తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కలిపి 150కిపైగా సినిమాలు చేశారు.

ఇదీ చూడండి:త్వరలో పంచదార కష్టాలు... ధరలు భారీగా పెరిగే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details