బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ముంబయిలోని ఓ ప్రదేశంలో షూటింగ్ జరగడంపై ఆనందం వ్యక్తం చేశారు.
1975లో 'దీవార్' చిత్రీకరణ చేసిన చోటే 'మేడే' షూటింగ్ కూడా జరుగుతోంది. ఆ రెండు చిత్రాల్లోనూ భాగమైన బిగ్‌బీ.. అప్పటి, ఇప్పటి ఫొటోలను కొలేజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత జ్ఞాపకాలను ఈ ప్రదేశం గుర్తు చేసిందని తెలిపారు.