తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ సినిమాలో అమితాబ్​ 'అతిథి' కాదు! - అమితాబ్​ బచ్చన్​ వార్తలు

ప్రభాస్​ కొత్త సినిమాలో అమితాబ్​ బచ్చన్​ది అతిథి పాత్ర అంటూ కొన్నిరోజుల నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై మాట్లాడిన నిర్మాత ప్రియాంక దత్.. స్పష్టతనిచ్చారు.అలానే దక్షిణాదిలో అమితాబ్​కు డబ్బింగ్​ చెప్పే గొంతు కోసం వెతుకుతున్నామని అన్నారు.

AMITABH ROLE IN PRABHAS MOVIE IS NOT GUEST ROLE
ప్రభాస్​ కొత్త సినిమాలో అమితాబ్​ అతిథిపాత్ర కాదు!

By

Published : Nov 27, 2020, 2:33 PM IST

Updated : Nov 28, 2020, 6:21 AM IST

రెబల్​స్టార్​ ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ చిత్రం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్​గా దీపికా పదుకొణె నటిస్తుండగా, అమితాబ్​ బచ్చన్​ కీలకపాత్ర చేస్తున్నారు. అయితే ఇందులో బిగ్​ బీ కేవలం అతిథి పాత్రలోనే కనిపించనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత ప్రియాంక దత్​ స్పందించారు.

"సినిమాలో‌ అమితాబ్​ది కొద్దిసేపు ఉండిపోయే పాత్ర కాదు. పూర్తి నిడివి గల పాత్రే చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. బిగ్‌ బీ పాత్రకు దక్షిణాది భాషల్లో వాయిస్‌ డబ్బింగ్‌ సమస్య ఉంది. ఆయనకు సరిపోయే గొంతు కోసం వెతుకుతున్నాం"

- ప్రియాంక దత్​, నిర్మాత

వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా ప్రకటన రాలేదు. కానీ ప్రముఖ సంగీత దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాను 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది.

ఇది కాకుండా ప్రభాస్‌.. 'రాధేశ్యామ్‌' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలానే 'ఆదిపురుష్' సినిమా కూడా చేయాల్సి ఉంది. దీని చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.

Last Updated : Nov 28, 2020, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details