తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆయనే నాకు పోటీ ఇచ్చే నటసర్కార్​ : అమితాబ్​ - అగస్త్య మంజుల

సంచలన దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ 'కోబ్రా' చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఈ విషయంపై స్పందించారు​ బిగ్​బీ అమితాబ్​.

ఆయనే నాకు పోటీ ఇచ్చే నటసర్కార్​ : అమితాబ్​

By

Published : Apr 8, 2019, 4:39 PM IST

వెండితెరపై తనదైన చిత్రాలతో పేరుతెచ్చుకున్న దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. రచయితగా, గాయకుడిగా తనలోని ప్రతిభ బయటపెట్టారు. ప్రస్తుతం 'కోబ్రా' అనే సినిమాతో నటుడిగా పరిచయమవుతున్నాడు. ఆదివారం వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం ప్రకటించింది ఆర్జీవీ గన్​షాట్​ ఫిలిమ్స్​. ఈ వార్తలపై అమితాబ్​ బచ్చన్​ స్పందించారు.

కోబ్రా పోస్టర్​లో రామ్​గోపాల్​ వర్మ

"రామ్​గోపాల్​ వర్మ.. మీలో అసలైన కోణాన్ని చూడబోతున్నాం. నటుడిగా మారుతున్న మీకు ఆల్​ ద బెస్ట్​ సర్కార్​..!​ .. నాతో మరొకరు పోటీకి వస్తున్నారు"
- అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ అగ్రనటుడు

ఈ సినిమాకు రామ్​గోపాల్​ వర్మ, అగస్త్య మంజుల దర్శకులుగా వ్యవహరించనున్నారు. 'కోబ్రా' చిత్రంలో వర్మ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ 'ఆర్​' పాత్రలో కనిపించనున్నాడు. రంగారావు.. సీఎం కేసీఆర్​గా కనిపించనున్నారు. వర్మ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్​ చేసింది చిత్రబృందం.

ABOUT THE AUTHOR

...view details