బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీగార్డుల్లో ఒకరైన పోలీస్ కానిస్టేబుల్‌ను బదిలీ చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. బిగ్‌బీకి రక్షణ ఉన్నందుకుగాను అతడు ఏడాదికి రూ. కోటి 50 లక్షలు సంపాదిస్తున్నాడనే ఊహాగానాలే ఇందుకు కారణం.
ముంబయి పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన జితేంద్ర షిండేను.. 2015లో సాధారణ ట్రాన్స్ఫర్లో భాగంగానే డీబీ మార్గ్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత కాలంలో అమితాబ్‌కు ఉన్న ఎక్స్ కేటగిరీలో అతడు సభ్యుడిగా మారారని సదరు అధికారి స్పష్టం చేశారు.