Amitabh bachchan corona: బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.. ప్రతిరోజూ తన బ్లాగ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. కానీ బుధవారం మాత్రం 'డొమస్టిక్ కొవిడ్ సిట్యూయేషన్'(ఇంట్లోనే కరోనా పరిస్థితులు) వల్ల అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నానని అన్నారు.
అయితే అమితాబ్ రెండు బంగ్లాలో వైద్యపరీక్షలు చేయగా, సిబ్బందిలో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని క్వారంటైన్లో పెట్టినట్లు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు వెల్లడించారు.
2020లో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య.. కరోనా బారిన పడ్డారు. గతేడాది మే నెలకల్లా అమితాబ్ రెండు వ్యాక్సిన్ వేసుకున్నారు.