కరోనా నుంచి తన కుటుంబం త్వరగా బయటపడాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ధన్యవాదాలు చెప్పారు. ఈ విషయమై వరుస ట్వీట్లు చేశారు. బిగ్‌బీ అభిమానులు కొందరు, దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.
బిగ్‌బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు కొవిడ్ సోకినట్లు శనివారం నిర్ధరణ కాగా, ఐశ్వర్యా రాయ్‌తో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య వైరస్ బారినపడ్డట్లు ఆదివారం తేలింది. అయితే జయాబచ్చన్, శ్వేత నందకు మాత్రంగా నెగిటివ్ వచ్చింది.