బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్.. ఇటీవలె కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. బిగ్‌బీ, అభిషేక్ కనీసం మరో ఏడురోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
వీరిద్దరితో పాటు అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఎనిమిదేళ్ల మనవరాలు ఆరాధ్యలకూ కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వీరిని ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచారు అధికారులు. ఈ సందర్భంగా బిగ్‌బీ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రముఖులు, సన్నిహితులతో సహా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. మరికొంత మంది ఆలయాల్లో పూజలు నిర్వహించారు.