అగ్ర హీరోల సమక్షంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి ఘనంగా జరిగింది. అదేంటి అంత పెద్ద కథానాయిక ఎవరికి చెప్పకుండా, ఎటువంటి సమాచారం బయటకు రాకుండా వివాహం చేసుకుందా? అని ఆశ్చర్యపోతున్నారా. మరేం లేదు.. ఓ నగల దుకాణానికి సంబంధించిన ప్రకటనలో భాగంగా పై తతంగం అంతా జరిగింది.
కత్రినా కైఫ్ పెళ్లిలో అమితాబ్ బచ్చన్ స్టెప్పులు! - Jaya Bachchan,amitabh bachchan
హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లిలో స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ దంపతులు డ్యాన్స్ చేసి, అలరించారు. ఇదంతా నగల దుకాణానికి సంబంధించిన కొత్త వాణిజ్య ప్రకటనలో భాగంగా జరిగింది.
ఈ నగల దుకాణం కోసంతాజాగా కొత్త యాడ్‌ను తీశారు. ఇందులో కత్రినా తల్లిదండ్రులుగా అమితాబ్ బచ్చన్ దంపతులు నటించారు. ఈ పెళ్లికి వచ్చిన ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున(తెలుగు), శివరాజ్‌కుమార్(కన్నడ), ప్రభు(తమిళం) కనిపించారు. ఈ ప్రకటన కోసం నటి కత్రినా కైఫ్‌తో కలిసి అమితాబ్ బచ్చన్ దంపతులు డ్యాన్స్ చేయడం విశేషం. ఈ ఫొటోలు కొన్నింటిని అమితాబ్ తన ట్విట్టర్లో పంచుకున్నారు. పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ఒకప్పటి అగ్రహీరోల కుమారులతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు.