తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా భార్యకు టన్నుల కొద్ది ప్రేమలేఖలు రాశాను: అమితాబ్

అమితాబ్​​ తన ప్రేమవివాహం గురించి, జయా బచ్చన్​కు రాసిన ప్రేమలేఖలు గురించి వెల్లడించారు. 'కౌన్​బనేగా కరోడ్​పతి' షోలో ఓ కంటెస్టెంట్​తో మాట్లాడూతూ ఈ విషయాల్ని పంచుకున్నారు.

Amitabh Bachchan reveals he wrote many love letters to wife Jaya
'జయా బచ్చన్​కు టన్నుల కొద్ది ప్రేమలేఖలు రాశాను'

By

Published : Nov 19, 2020, 11:53 AM IST

తన భార్య జయా బచ్చన్​కు టన్నుల కొద్ది ప్రేమలేఖలు రాశానని, ఇప్పటికీ రాస్తున్నానని బిగ్​బీ అమితాబ్ బచ్చన్ చెప్పారు. బుధవారం (నవంబరు 18) ప్రసారమైన కౌన్​ బనేగా కరోడ్​పతి ఎపిసోడ్​లో ఓ రైతుతో మాట్లాడుతూ పై విషయాలు వెల్లడించారు.

బుధవారం ఎపిసోడ్​లో మహారాష్ట్రకు చెందిన పాడిరైతు పాల్గొన్నారు. కరోనా కారణంగా తన నిశ్చితార్థం జరిగినా సరే పెళ్లి వాయిదా పడిందని అతడు తెలిపారు. ఇదే సమయంలో జయా బచ్చన్​తో వివాహం ఎలా జరిగిందని బిగ్​బీని ఆ రైతు అడిగారు. అప్పట్లో జయ​కు టన్నుల కొద్ది లేఖలు రాశానని, ఇప్పటికీ రాస్తున్నానని అమితాబ్​ తెలిపారు.

నా తండ్రి మాట పాటించాను

"1973లో 'జంజీర్​' హిట్​గా నిలిచిన తర్వాత కొద్దిమంది స్నేహితులతో లండన్​ వెళ్లి, సెలబ్రేట్​ చేసుకుందామని అనుకున్నాను. విషయం మా నాన్నకు చెప్పగా.. 'ఎవరితో వెళ్తున్నావు?' అని అడిగారు. జయ పేరు చెప్పగా.. 'ఆమెను పెళ్లి చేసుకొని తీసుకెళ్లు. లేకపోతే వద్దు' అని తేల్చిచెప్పారు. ఆ తర్వాతి రోజు ఆమెను పెళ్లి చేసుకున్నాను" అని అమితాబ్​ ఆ రైతుతో చెప్పారు.

డ్రామా-థ్రిల్లర్​గా 'మేడే'

అమితాబ్​ బచ్చన్​, అజయ్​ దేవగణ్​ దర్శకత్వంలో 'మేడే' సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా రకుల్​ ప్రీత్​ను ఎంపిక చేసినట్లు గురువారం అధికారికంగా ప్రకటించారు. డ్రామా-థ్రిల్లర్​గా ఈ సినిమా రూపొందించనున్నారు. హైదరాబాద్​లో ఈ డిసెంబరు నుంచి షూటింగ్ మొదలు కానుంది.

ABOUT THE AUTHOR

...view details