బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తన మనవరాలు ఆరాధ్య బచ్చన్‌తో ఓ పాటను పాడారు. ఈ సందర్భంగా రికార్డింగ్ స్టూడియోలో వారిద్దరూ దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు బిగ్‌బీ. వీరిద్దరితో పాటు ఆరాధ్య తల్లిదండ్రులైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లు అక్కడే ఉన్నారు.
'తాత, మనవరాలు కలిసి మైక్ ముందుకు వచ్చినప్పుడు..' ట్యాగ్‌తో ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అమితాబ్ షేర్ చేశారు. అయితే ఆ పాట ఏదైనా సినిమా కోసమా లేదా స్పెషల్ సాంగా? అనేది తెలియాల్సిఉంది. అమితాబ్ గతంలో 'మెరే పాస్ ఆవో', 'రంగ్ బర్సే', 'మే యహా తూ వహా' అనే పాటలతో ఆయనలోని సింగర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.