తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా టీకా తీసుకున్న అమితాబ్ ఫ్యామిలీ​ - అమితాబ్ కొవిడ్ 19వ వ్యాక్సిన్

బాలీవుడ్​ సీనియర్ నటుడు అమితాబ్​ బచ్చన్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అభిషేక్ తప్ప ఫ్యామిలీ అంతా టీకా తొలి డోసు తీసుకున్నట్లు వెల్లడించారు.

Amitabh Bachchan
అమితాబ్

By

Published : Apr 2, 2021, 10:00 AM IST

Updated : Apr 2, 2021, 11:48 AM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్​ కుటుంబం కరోనా వ్యాక్సిన్​ తీసుకుంది. ఈ విషయాన్ని బిగ్​బీ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. అభిషేక్ మినహా తామంతా వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు.

"వ్యాక్సినేషన్ పూర్తయింది. అంతా బాగుంది. గురువారం నాతో పాటు కుటుంబం, సిబ్బంది అందరం కరోనా టెస్టు చేయించుకున్నాం. ఫలితం నెగెటివ్​గా వచ్చింది. అందువల్ల ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్నాం. అభిషేక్ తప్ప అందరం తీసుకున్నాం. అతను వేరే దగ్గర ఉన్నాడు. త్వరలోనే తిరిగి వస్తాడు."

-అమితాబ్ బచ్చన్, నటుడు

గతేడాది అమితాబ్​తో పాటు అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్​ వచ్చింది. తర్వాత వీరంతా కోలుకుని షూటింగ్​లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం 'దాస్వీ' అనే సోషల్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు అమితాబ్. ఈ సినిమా షూటింగ్​ ఇటీవలే ఆగ్రాలో జరిగింది.

ఇప్పటికే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర, హేమా మాలిని, మోహన్ ​లాల్, జితేంద్ర, కమల్ హాసన్, నాగార్జున, రోహిత్ శెట్టి, నీనా గుప్తా, రాకేశ్ రోషన్, జానీ లీవర్ కరోనా తొలి డోసు తీసుకున్నారు.

Last Updated : Apr 2, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details