తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ నిశబ్దమైన రాత్రి.. నా తండ్రిని గుర్తుచేస్తోంది' - కవిత పాడిన అమితాహ్​

కరోనా చికిత్స తీసుకుంటోన్న బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​.. తన తండ్రిని గుర్తుచేసుకున్నారు. ఆయన రాసిన ఓ పద్యాన్ని బిగ్​బీ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది.

Amitabh Bachchan recalls father's words to fill his empty nights
బిగ్​బీ

By

Published : Jul 27, 2020, 4:28 PM IST

Updated : Jul 27, 2020, 5:29 PM IST

కరోనాతో పోరాడుతోన్న బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిర్బంధంలో ఉన్న బిగ్​బీ.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో రాత్రుళ్లు తన తండ్రి, ప్రముఖ రచయిత హరివంశ్​ రాయ్​ బాగా గుర్తొస్తున్నారని తెలిపారు. తాజాగా ఆయన రచించిన ఓ పద్యాన్ని స్వయంగా బిగ్​బీ తన స్వరంతో ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. 'హే అందేరి రాత్​ పర్​ దియా జలానా కబ్​ మనా హై' అంటూ సాగిన ఈ కవిత నెటిజన్ల గుండెకు బలంగా హత్తుకుంటోంది.

"ఈ నిశబ్దమైన రాత్రిలో ఒంటరిగా ఉన్న నాకు నా తండ్రి, ఆయన రాసిన కవిత బాగా గుర్తొస్తోంది. ఆయనను చాలా మిస్​ అవుతున్నా."

-అమితాబ్​ బచ్చన్​, నటుడు.

అమితాబ్​ సహా ఆయన తనయుడు అభిషేక్​ బచ్చన్​, కోడలు ఐశ్వర్యా రాయ్​, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

తండ్రిని గుర్తుచేసుకుంటూ పద్యం పాడిన బిగ్​బీ
Last Updated : Jul 27, 2020, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details