తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యువకుడి ప్రతిభకు బిగ్​బీ అమితాబ్​ ఫిదా - అమితాబ్​ తాజా వార్తలు

మౌత్​ ఆర్గాన్​ను అద్భుతంగా వాయిస్తున్న ఓ యువకుడి ప్రతిభకు అమితాబ్​ బచ్చన్​ ఫిదా అయిపోయారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇటువంటి మ్యూజిక్​ ఎప్పుడూ వినలేదని పేర్కొన్నారు.

Amitabh Bachchan praises young talent playing mouth organ, shares video
యువకుడి ప్రతిభకు అమితాబ్​ ఫిదా

By

Published : Jul 28, 2020, 12:11 PM IST

Updated : Jul 28, 2020, 1:49 PM IST

ఎవరిలో ప్రతిభ​ కనిపించినా వారిని ప్రోత్సహించడంలో బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్ ముందుంటారు​. తాజాగా మౌత్​ ఆర్గాన్​తో అద్భుతంగా సంగీతాన్ని సృష్టించిన ఓ యువకుడి టాలెంట్​కు ఈయన ముగ్దుడయ్యారు. ఆ వీడియోను ట్విట్టర్​ వేదికగా పంచుకుని అతడిని ప్రశంసిచారు బిగ్​బీ.

దాదాపు ఐదు నిమిషాల పాటు సాగే ఈ వీడియోను చూసిన అమితాబ్​.. "మౌత్​ ఆర్గాన్​తో ఇంత వినసొంపైన సంగీతాన్ని ఇంతకుముందెన్నడూ వినలేదు. అద్భుతం" అని ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

కేరళకు చెందిన ఓ అమ్మాయి ఫ్యూజన్​ మ్యూజిక్​ ప్రదర్శించిన వీడియోను గతంలో ట్విట్టర్ ​వేదికగా అభిమానులతో పంచుకున్నారు బిగ్​బీ. ఇటీవలే కరోనా బారిన పడిన అమితాబ్​.. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

Last Updated : Jul 28, 2020, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details