తెలంగాణ

telangana

ETV Bharat / sitara

45 మిలియన్ల ఫాలోవర్లు.. బిగ్​బీ ఎమోషనల్​ ట్వీట్ - అమితాబ్ ట్విట్టర్​ ఫాలోవర్లు

బిగ్​బీ అమితాబ్​ ఎమోషనల్​ ట్వీట్ చేశారు. ట్విట్టర్​లో 45 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్న క్రమంలో తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.

Amitabh Bachchan now has 45 million followers on Twitter
45 మిలియన్ల ఫాలోవర్లు.. బిగ్​బీ ఎమోషనల్​ ట్వీట్

By

Published : Jan 9, 2021, 3:50 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ట్విట్టర్​లో మరో మార్క్​ను అందుకున్నారు. 45 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్​ను శనివారం చేరుకున్న సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తండ్రి హరివంశరాయ్​ కాళ్లకు తాను దండం పెడుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈయనకు ఫేస్​బుక్​లో 29 మిలియన్లు, ఇన్​స్టాలో 24.5 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం.

"ఆ ఫొటో చాలా జ్ఞాపకాల్ని గుర్తు చేసింది. 'కూలీ' సినిమా షూటింగ్​లో ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడే ఇంటికొచ్చాను. ఆ రోజే నాన్న ఏడవడం చూశాను" అని అమితాబ్ రాసుకొచ్చారు.

1982లో బెంగళూరు 'కూలీ' చిత్రీకరణలో అమితాబ్​కు తీవ్రగాయాలయ్యాయి. కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. అయితే ఆ ప్రమాదం నుంచి బయటపడటం తనకు పునర్జన్మ లాంటిది అని గతంలో చాలాసార్లు బిగ్​బీ చెప్పారు. ప్రస్తుతం ఈయన 'ఝండ్', 'బ్రహ్మాస్త్ర', 'చెహ్​రే', 'మేడే' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇది చదవండి:అమితాబ్​ కోసం 14 ఏళ్లుగా ఉపవాస వ్రతం!

ABOUT THE AUTHOR

...view details