తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ ఆదివారం శూన్యంలా అనిపించింది' - అమితాబ్​

ప్రతి ఆదివారం అభిమానులతో సమావేశమయ్యే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి మిస్​ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఆదివారం తనకు శూన్యంలా అనిపించిందని పేర్కొన్నారు.

Amitabh
అమితాబ్

By

Published : Sep 7, 2020, 6:39 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ ఆదివారం తన అభిమానులతో సమావేశం కాలేకపోయారు. గత 38 ఏళ్లుగా.. ప్రతి ఆదివారం జల్సా హౌస్​లో తన అభిమానులను కలుసుకుని పలకరిస్తుంటారు బిగ్​బీ. అయితే ఈ సారి కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కార్యక్రమాన్ని నిలిపేశారు.

దీనిపై బచ్చన్​ ట్విట్టర్​ వేదికగా స్పందిస్తూ.. ఈ ఆదివారం శూన్యం ఆవరించిందని పేర్కొన్నారు. "శ్రేయోభిలాషుల పలకరింపులతో, ఆనందాలతో నిండిపోయే ఆదివారపు సాయంత్రాలు.. ఇప్పుడు లేకపోవడం వల్ల శూన్యం ఆవరించినట్లు అనిపిస్తోంది" అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం బచ్చన్​ 'కౌన్​ బనేగా కరోడ్​పతి' సీజన్​ 12 షూటింగ్ ప్రారంభించారు. మరోవైపు కరోనా కాలంలో చాలా మంది ప్రజలు ఎటువంటి రక్షణ లేకుండా వీధుల్లో తిరగడం చూసి చాలా బాధగా ఉందని అన్నారు.

జులైలో అమితాబ్​ కరోనా బారిన పడ్డారు. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరిన ఆయన.. ప్రతిరోజూ తన అభిమానులకు హెల్త్​ అప్​డేట్స్​ను ఇస్తుండేవారు. ఈ క్రమంలోనే ఆగస్టు 2న నెగిటివ్​ నిర్ధరణ కాగా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details